జనవరిలో 0.81 శాతం తగ్గిన టెలికాం సబ్‌స్క్రైబర్లు!

by Harish |
జనవరిలో 0.81 శాతం తగ్గిన టెలికాం సబ్‌స్క్రైబర్లు!
X

న్యూఢిల్లీ: దేశీయంగా టెలికాం రంగంలో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు 2021 చివర్లో 115.46 కోట్ల నుంచి 114.52 కోట్లకు స్వల్పంగా క్షీణించారని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ బుధవారం వెల్లడించింది. నెలవారీగా ఇది 0.81 శాతం తగ్గుదల అని ట్రాయ్ తెలిపింది. మొత్తం వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో జనవరి చివరి నాటికి 63.33 కోట్ల నుంచి 62.71 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 52.12 కోట్ల నుంచి 51.8 కోట్లకు తగ్గారు. గణాంకాల ప్రకారం.. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలు మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లలో 89.76 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కలిసి జనవరి చివరి నాటికి 10.24 శాతం వాటాతో కొనసాగుతున్నాయి.

కంపెనీల పరంగా చూస్తే.. దిగ్గజ రిలయన్స్ జియో మొత్తం టెలికాం సబ్‌స్క్రైబర్లలో 35.49 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో భారతీ ఎయిర్‌టెల్ 31.13 శాతం, వొడాఫోన్ ఐడియా 23.15 శాతం వాటాను కలిగి ఉన్నాయి. పీఎస్‌యూల్లో బీఎస్ఎన్ఎల్ 9.95 శాతం, ఎంటీఎన్ఎల్ 0.28 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed