'కార్తికేయ‌-2'లో కలర్స్ స్వాతి ఎంట్రీ ఉంటుందా?

by sudharani |
కార్తికేయ‌-2లో కలర్స్ స్వాతి ఎంట్రీ ఉంటుందా?
X

దిశ, సినిమా : 'కార్తికేయ‌-2' మూవీ అనేక వాయిదాల తర్వాత ఎట్టకేల‌కు ఆగ‌స్టు 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో 'నా సినిమాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్లే ఇన్ని ఆటంకాలు' అంటూ తాజాగా నిఖిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన మరొక లేటెస్ట్ న్యూస్ కూడా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సీక్వెల్ అంటే ఫ‌స్ట్ పార్ట్ ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచే క‌థ కొన‌సాగుతుంది. అదే ఫ్రాంఛైజీ విషయంలో ఒరిజినల్ పాత్రలు తీసుకుని కొత్త క‌థ‌తో సినిమా తీస్తారు. ఇక్కడ 'కార్తికేయ‌-2' మాత్రం ప‌క్కా సీక్వెల్ అని తన ఇంట‌ర్వ్యూలో స్పష్టం చేశాడు నిఖిల్. అంతేకాదు ఇది సీక్వెల్ అయితే.. ఫ‌స్ట్ పార్ట్‌లో తనకు జోడీగా నటించిన స్వాతి రోల్ సంగ‌తేంటనే ప్రశ్నకు కూడా తడబడకుండా స‌మాధానమిచ్చాడు. కథలో భాగమైన స్వాతి పాత్ర ఇందులో తప్పక ఉంటుంద‌న్న నిఖిల్.. సినిమాలో స్వాతి ఉందా? లేదా? అన్నది మాత్రం తెర మీదే చూడాల‌ని చెప్పాడు.

Advertisement

Next Story