- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ సినిమాలో అతనికి పవర్ ఫుల్ రోల్.. ఇదైనా కలిసొస్తుందా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం రాపో19తో బిజీగా ఉన్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి 'ది వారియర్' అని నామకరణం చేశారు. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీలో కీలక పాత్ర 'గురు'ను పరిచయం చేశారు. ఆ పాత్రలో తమిళ స్టార్ హీరో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. అయితే ఆది తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసి గుర్తింపు అందుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు విలన్‌గా 'సరైనోడు' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ మూవీ బంపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఆది కోరుకున్న హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. ఇటీవల ఆది నటించిన 'గుడ్ లక్ సఖి' బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అయితే ఇప్పడు 'ది వారియర్'లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో రామ్ అయినా ఆదికి సరైన హిట్ అందిస్తాడా అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.