- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెలిపిస్తే మాఫియా, అవినీతి రహితంగా పంజాబ్: ప్రధాని మోడీ
ఛంఢీగఢ్: తాము అధికారంలోకి వస్తే మాఫియా, అవినీతి రహిత పంజాబ్‌ను నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తమ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను అవమానించారని ఆరోపించారు. సోమవారం జలంధర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 'కెప్టెన్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి నడపడం కోరుకోవడం లేదని వారు చెప్పారు. దానికి అర్థం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుటుంబం చేత నడపబడుతున్నాయి. రాజ్యాంగం ద్వారా కాదు' అని అన్నారు. కెప్టెన్ కేంద్ర ప్రభుత్వంతో పని చేస్తే అప్పుడు ఆయన రాజ్యాంగాన్ని పాటించట్లేదా అని ప్రశ్నించారు. వారు పంజాబ్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటునే ఉన్నారని, చివరికి కెప్టెన్‌ను గెంటేశారని కాంగ్రెస్‌ను విమర్శించారు. దీనికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పతనం దిశగా వెళ్తుందని, వారి సొంత నేతలే విమర్శిస్తున్నారని చెప్పారు. అంతర్గత కలహాలతో ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అని ప్రశ్నించారు. 'బీజేపీతో నూతన పంజాబ్, కొత్త పంజాబ్‌తో కొత్త టీం' అని ప్రధాని నిదానం ఇచ్చారు. కాగా గత నెలలో పంజాబ్‌లో భద్రతా వైఫల్యం తర్వాత ప్రధాని పాల్గొన్న ర్యాలీ ఇదే కావడం గమనార్హం. ఈ నెల 20న పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.