దేవున్ని కోరిక తీర్చమని అడేగే ముందు.. ఆ కోరిక బయటకు ఎందుకు చెప్పరో తెలుసా ?

by samatah |
దేవున్ని కోరిక తీర్చమని అడేగే ముందు.. ఆ కోరిక బయటకు ఎందుకు చెప్పరో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి మనిషికి కోరికలు ఉండటం అనేది సహజం. చాలా మంది తమ కోరికలను ఎక్కువగా ఎవరితో షేర్ చేసుకోరు. కానీ దేవునితో మాత్రం ఇష్టంగా చెప్పుకుంటారు. అయితే పెద్దలు అంటూ ఉంటారు.. కోరికలు అనేవి బయటకు చెప్పుకోకూడదు, దేవున్ని తలుచుకొని మనసులోనే కోరుకోవాలని. మనసులోనే దేవునికి మన కోరికను ఎందుకు చెప్పాలి, అలా చెప్పడం వలన జరిగే ఫలితం ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనం చిన్నప్పుడు ఎకనామిక్స్‌లో చదివే ఉంటాం. కోరికలు అనంతం.. పత్రి మనిషికి చాలా కోరికలు ఉంటాయి, ఒక కోరిక తీరిన తర్వాత మరో కోరిక కలుగుతుంది అని. అయితే అలా మనిషి కోరికల పుట్ట, పైచదువులకు వెళ్లాలని, మంచి భార్యరావాలని, బోలెడంత డబ్బు సంపాదించాలని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి. ఇక వాటిని తీర్చమని తమ ఇష్టదైవం అయిన గుడికి వెళ్లి దేవుడిని వేడుకుంటాడు. ఎవరికీ తమ కోరికలను చెప్పుకోలేడు కాబట్టి.. నిష్టగా దేవుని వద్ద తన మనస్సు పెట్టి.. తన కోరికలను చెప్పుకుంటాడు, నెరవేర్చాలని కోరుకుంటాడు. అయితే ఆ కోరికను బయటికి చెప్పడం వలన అది నెరవేరదు అని కొందరు అంటుంటారు. ఎందుకంటే మనం కోరికను దేవునితో చెప్పుకునే సమయంలో మన చుట్టూ ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. వారు మన కోరికను విని సంతోషపడినా, అది నెరవేర కూడదు అని కోరుకుంటారు. మరి కొంత మంది కోరిక నెరవేరకూడదని ఎదో ఒక ప్రయత్నం చేస్తారు. అందు వలన కోరికలను బయటకు చెప్పుకోకూడదు అంటారు పండితులు.

Advertisement

Next Story