ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరు టాలెంట్ ఉండాలి.. టాలీవుడ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

by Hamsa |
ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరు టాలెంట్ ఉండాలి.. టాలీవుడ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుయంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ మూవీ సక్సెస్‌ మీట్‌కు గెస్ట్‌గా హాజరయ్యారు. హైదరబాద్‌లో ఈవెంట్ జరిగింది. అయితే ఇందులో దిల్ రాజు(Dil Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘క ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ విన్నా. అలాగే ఓ హీరో తనకు సెలబ్రిటీలు సపోర్ట్ చేయట్లేదని అన్నాడు. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరే నీరూపించుకోవాలి. ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు. ఎవరో ఏదో అన్నారని భయపడకూడదు. టాలెంట్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు.

ఇక్కడ కేవలం టాలెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కిరణ్ అబ్బవరం కష్టపడటం వల్ల ‘క’ సినిమా ఇంతటి విజయం సాధించింది. మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి హిట్ అందుకున్నారు. మీకు సక్సెస్ వచ్చినప్పుడు వచ్చి మాలాంటి వాళ్లు అభినందిస్తారు. అంతే కానీ ఈ సినిమా మీది. అందుకే విజయం వచ్చింది. అయితే 50 ఏళ్ల క్రితం పల్లెటూర్లలో ఉండేవాళ్లు ఖాళీగా కూర్చొని ఇతరుల గురించి మాట్లాడుకునేవారు. వాళ్లు అదృష్టవంతులు కాబట్టి అప్పుడు సోషల్ మీడియా(Social Media) లేదు.

ఆ విషయాలు ఊరిలోనే ఆగిపోయాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ప్రపంచానికి అన్నీ తెలుస్తున్నాయి. దానివల్ల ఏమీ జరగదు. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనమేంటో నీరూపించుకోవాలి. ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు కూడా ఈ విషయం గుర్తుంచుకోండి. మీకు టాలెంట్ ఉంటే ఎవరు ఎమనుకున్నా పట్టించుకోవద్దు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ దిల్ రాజు వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.



Next Story

Most Viewed