- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Loan On Whatsapp: 30 సెకన్లలో WhatsApp నుంచి లోన్.. ఇలా అప్లై చేయండి!
దిశ, వెబ్‌డెస్క్: Now get instant loan on whatsapp in 30 seconds| అత్యవసర ఆర్థిక పరిస్థితులలో రూణాలు కావాల్సిన వారు బ్యాంకులు లేదా ప్రైవేటు రుణ సంస్థలను సంప్రదిస్తారు. టెక్నాలజీ మారుతున్న కొద్ది ప్రస్తుతం లోన్‌లు ఇచ్చే యాప్‌లో మార్కెట్లో చాలా పుట్టుకొచ్చాయి. వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా డిజిటల్ పద్ధతిలో KYC పూర్తిచేసి అత్యవసర రూణాలను యాప్‌లు అందిస్తున్నాయి. ఇప్పటికే లోన్ కావాల్సిన వారు ప్రత్యక్ష్యంగా బ్యాంకులు లేదా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలను సంప్రదించకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా లోన్ పొందుతున్నారు. చాలా కంపెనీలు కూడా యాప్‌ల ద్వారా లోన్‌లు మంజూరు చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ జాబితాలో మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా చేరింది. ఇంతకుమందే ఆర్థిక లావాదేవీల(UPI ట్రాన్స్‌ఫర్)కు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వాట్సాప్ వినియోగదారులకు మరింత చేరువకావడానికి కొత్తగా లోన్‌లు మంజూరు చేసే కొత్త ఆప్షన్‌ను తెచ్చింది. వాట్సాప్ గేట్‌వే ద్వారా పేమెంట్‌లకు అనుమతించిన విధంగానే ప్రముఖ క్రెడిట్ సంస్థ CASHe తరపున WhatsApp ప్రత్యేక క్రెడిట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది బిజినెస్ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. బిజినెస్ కేటగిరి వారు కేవలం 30 సెకన్లలో రుణాన్ని పొందవచ్చు. దీనికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు.
రుణం పొందడం ఎలా?
WhatsApp CASHe ద్వారా లోన్ పొందడానికి వినియోగదారులు ఫోన్‌లో +91 80975 53191 నంబర్‌ను సేవ్ చేయాలి. తరువాత WhatsApp చాట్ బాక్స్‌కి వెళ్లి HIఅని టైప్ చేయాలి. మెసేజ్ సెండ్ అయ్యాక ముందస్తుగా ఆమోదించబడిన లోన్‌కు సంబంధించిన వివరాలు వస్తాయి. ఇది మొత్తం AI-ఆధారితమైనది. 24 గంటలు పనిచేస్తుంది. రెగ్యులర్‌గా జీతాలు తీసుకునే వారు మాత్రమే ఈ లోన్‌కు అర్హులు. AI- పవర్డ్ మోడ్ ద్వారా KYC వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మీకు ఉన్నటువంటి క్రెడిట్ స్కోర్ ఆధారంగా గరిష్టంగా రుణం ఎంత అందించబడుతుంది అనే వివరాలు తెలియజేస్తారు.