- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేనతో కలిసి వైసీపీపై పోరాటం చేయబోతున్నాం : సోము వీర్రాజు
దిశ, ఏపీబ్యూరో: అమిత్‌షా 2 నెలల క్రితమే తిరుపతిలో రూట్ మ్యాప్ ఇచ్చారని, ఆయన ఆదేశాలను అనుసరించే జనసేనతో కలిసి వైసీపీపై పోరాటం చేయబోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై క్షేత్ర స్థాయిలో పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు కోసం మెగా డీఎస్సీ ఇంతవరకు తీయలేదన్నారు.
పోలీసు రిక్రూట్‌మెంట్ లేదని, రెవెన్యూ, సివిల్ ఇంజనీరింగ్, విద్యుత్ రంగాల్లో ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదని మండిపడ్డారు. సీఎం జగన్ రూ.5 వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 20 లక్షల ఇళ్లు ప్రభుత్వం ఇస్తే వాటికి రూ.30 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు.. ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. 2024లో జనసేనతో కలిసి అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఈ నెల 19వ తేదీన రాయలసీమ రణభేరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.