Varun Tej: ఆ పార్ట్‌ కంట్రోల్‌లో ఉంది కాబట్టే ఇక్కడి వరకు వచ్చా.. బోల్డ్‌గా ‘మట్కా’ ట్రైలర్

by Hamsa |   ( Updated:2024-11-02 07:34:06.0  )
Varun Tej: ఆ పార్ట్‌ కంట్రోల్‌లో ఉంది కాబట్టే ఇక్కడి వరకు వచ్చా.. బోల్డ్‌గా ‘మట్కా’ ట్రైలర్
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఫ్లాప్, హిట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజెంట్ వరుణ్ తేజ్(Varun Tej) ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనిని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్(Vyra Entertainments), ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తుండగా.. కరుణ కుమార్(Karuna Kumar) తెరకెక్కిస్తున్నారు. 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, గ్యాబ్లింగ్ కథాంశంతో రాబోతున్న ‘మట్కా’(Matka) నవంబర్ 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, నోరా ఫతేహి(Nora Fatehi), సలోని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ చిరంజీవి చేతుల మీదుగా ‘మట్కా’(Matka) ట్రైలర్‌ను విడుదల చేయించారు. అయితే ట్రైలర్‌లో వరుణ్ చెప్పిన ‘‘ నాకు ఇక్కడ మెదడు.. గుండె.. ఇంకా ఇంకా కిందకు కంట్రోల్ ఉంది కాబట్టి ఇలా ఉన్నాను’’ అనే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. అలాగే ఇందులోని వరుణ్ లుక్స్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


Advertisement

Next Story