వరలక్ష్మీ వ్రతం: ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ

by GSrikanth |
వరలక్ష్మీ వ్రతం: ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో భారీగా భక్తులు సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ద్వారకాతిరుమలలో భక్తుల రద్దీ భారీ పెరిగింది. కుంకుళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాకాంబరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా, శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీ దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని, సకల సంపదలతో తులతూగుతామని, మహిళలు ముత్తయిదువులుగా జీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు.


Next Story