- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? ఊహించని అనారోగ్య సమస్యలు!
దిశ, ఫీచర్స్ : నేటి ప్రపంచంలో మనిషికి స్మార్ట్‌ఫోన్ కన్నా విలువైన సన్నిహితుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఒక్క నిమిషం ఫోన్ కనిపించకపోతే అల్లాడిపోయే స్థాయికి చేరుకున్నాం. ఇక గతంలో చాలామంది ఉదయం లేవగానే దేవుడి ఫొటో చూసేందుకు ఇష్టపడేవారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఫోన్ ఆక్రమించేసింది. ముందుగా ఫోన్ చెక్ చేస్తేగానీ ఆ రోజు మొదలవడం లేదు. ఈ క్రమంలోనే వాష్‌రూమ్‌కు తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. అయితే ఈ అలవాటు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరింత హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
ఉబ్బరం, అతిసారం సంబంధిత సమస్యలు
టాయిలెట్‌కు వెళ్లినపుడు చాలా మంది సరైన వాష్‌రూమ్ మర్యాదలు పాటించడం లేదు. కొందరు వాష్‌రూమ్‌లోని హైజీన్‌పై ఎక్కువ శ్రద్ధ చూపరు. టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడం మర్చిపోతారు. ఆ తర్వాత చేతులు శుభ్రం చేయకుండానే ఆహారం తింటారు. ఇలా చేస్తే బ్యాక్టీరియా కడుపులోకి చేరి.. UTI, అతిసారం, జీర్ణ సంబంధిత సమస్యలకు సంబంధించి అనారోగ్యానికి దారి తీస్తుంది. ఒకవేళ ఈ బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్ సోకితే కడుపు, ప్రేగుల్లోని అంతర్గత భాగాల్లో కొంత మంటను ఎదుర్కోవచ్చు.
మలబద్ధకం, పైల్స్: జీర్ణ వ్యవస్థ అప్‌సెట్ అయితే మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ సేపు వాష్‌రూమ్‌లో కూర్చోవడం వల్ల విసర్జన అవయవాలపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడవచ్చు. ఇది పైల్స్, ఫిషర్స్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.
పెరిగిన ఇన్‌ఫెక్షన్ రిస్క్: ప్రతి వాష్‌రూమ్.. ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయం. కాబట్టి మొబైల్ ఫోన్ ఉపయోగించినప్పుడు దానికి అంటుకునే బ్యాక్టీరియాతో మరింత హాని కలుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఫోన్‌కు అతుక్కుపోయి.. క్రమంగా కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి ఇన్‌ఫెక్షన్స్‌కు కారణం కావచ్చు.
మొబైల్ ఫోన్‌పై బ్యాక్టీరియా దాడి: ముందు చెప్పినట్లుగా వాష్‌రూమ్‌కు వెళ్లినపుడు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. అయినప్పటికీ, మీ స్మార్ట్‌ఫోన్‌లో సూక్ష్మక్రిములు చిక్కుకుపోతాయని గమనించడం ముఖ్యం. పైగా మీరు దాన్ని సరిగ్గా వాష్ చేయలేరు. అయితే ఫోన్ నుంచి ప్రమాదకరమైన జెర్మ్స్, బ్యాక్టీరియా తొలగింపునకు ఉత్తమ మార్గం.. 'జాగ్రత్తగా శానిటైజ్ చేయడమే'.
ఇవి కూడా చదవండి
1.కాలిక్యులేటర్‌తో ఆల్జిబ్రానా.. లాజిక్ చచ్చిపోయిందంటూ జాన్వీపై ట్రోలింగ్