- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాహ్.. కంటిని కన్‌ఫ్యూజ్ చేస్తున్న 'మాయా దర్పణం'
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాలీవుడ్ సినిమాల్లో 'హ్యారీ పోటర్' కూడా ఒకటి. ఈ సినిమాలోని ఇన్విజిబిలిటీ క్లాక్ నుంచి ప్రేరణ పొందిన యూకేకు చెందిన 'ఇన్విజిబిలిటీ షీల్డ్ కో' స్టార్టప్ రియల్ లైఫ్ ఇన్విజిబుల్ షీల్డ్స్ రూపొందిస్తోంది. ఈ షీల్డ్స్ దాని వెనకున్న ఆబ్జెక్ట్స్ కనిపించకుండా కంటిని మాయ చేస్తుండగా, ఇందుకోసం కంపెనీ ప్రత్యేకమైన 'ఇంజనీరింగ్ లెన్స్ సిరీస్'ను ఉపయోగిస్తోంది. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు సాయపడే ఈ షీల్డ్స్ విశేషాలు తెలుసుకుందాం.
'ఇన్విజబుల్ షీల్డ్స్' అనేవి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే కాంతిని షీల్డ్ ముందు భాగంలో వ్యాపింపజేయడంతో పరిశీలకుడి దృక్కోణం నుంచి చూసినప్పుడు సాధారణంగా కనిపించే ప్రాంతం కనిపించదు. తద్వారా దాని వెనక ఉంటే ఎవరికీ కనిపించరు. ఎన్నో ప్రయోగాల తర్వాత ఇన్విజిబుల్ షీల్డ్స్‌కు ఓ రూపం తీసుకొచ్చిన పరిశోధకుల బృందం.. వీటిని 100శాతం రీసైక్లింగ్‌కు అనువుగా తయారుచేయడం విశేషం. ఆకులు, గడ్డి, రెండర్ చేసిన గోడలు, ఇసుక, ఆకాశం, తారు, సముద్రం వంటి నేపథ్యాల్లో ఈ షీల్డ్స్ ఉత్తమ పనితీరును ప్రదర్శిస్తాయన్న మేకర్స్.. దాడుల నుంచి మాత్రం కాపాడలేవని స్పష్టం చేశారు. వీటిని కిక్‌స్టార్టర్ ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేసుకునే అవకాశముండగా 12×8 అంగుళాల పరిమాణం గల ఇన్విజిబిలిటీ షీల్డ్ ధర £49 ($65) ఉంది. ఈ మేరకు వందల కొద్దీ ముందస్తు ఆర్డర్స్ నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్‌లోగా డెలివరీలను ప్రారంభించాలని భావిస్తోంది ఇన్విజిబిలిటీ షీల్డ్ కంపెనీ.