Nimrat Kaur: మహిళలు ఎందుకలా చూపిస్తారు? హీరోయిన్ బ్రెస్ట్ ఫొటోపై నెటిజన్..

by Mahesh |   ( Updated:2022-04-19 07:36:04.0  )
Nimrat Kaur: మహిళలు ఎందుకలా చూపిస్తారు? హీరోయిన్ బ్రెస్ట్ ఫొటోపై నెటిజన్..
X

దిశ, సినిమా : ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు పంచుకునేందుకు, భావాలు వ్యక్తీకరించేందుకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. ఇది మంచి పరిణామమే అయినా కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారి హాట్ డిస్కషన్‌కు దారితీస్తాయి. తాజాగా ఓ ట్విట్టర్ యూజర్ మహిళలను ఒక విచిత్రమైన ప్రశ్న అడిగి కొత్త చర్చ లేవనెత్తాడు. 'దస్వి' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'ది కపిల్ శర్మ షో'కు హాజరైన నటి నిమ్రత్ కౌర్(Nimrat Kaur) ఫొటోను షేర్ చేస్తూ ఈ విధంగా ప్రశ్నించాడు. ఈ ప్రొగ్రామ్‌కు బ్లాక్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన నిమ్రత్.. క్లీవేజ్ షోతో గ్లామర్ ఒలకబోసింది. కాగా ఇదే ఫొటోను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్.. 'కేవలం పురుషులను ఆకర్షించేందుకే మహిళలు ఇలాంటి దుస్తులు ధరిస్తారా? అది నిజం కాకుంటే ఇంకెందుకో తెలుసుకోవాలనుంది' అని పోస్ట్ చేశారు.

అయితే ఇలాంటి వివాదాస్పద క్వశ్చన్ అడగడంపై నెటిజన్లు సదరు ట్విట్టర్ యూజర్‌ను కార్నర్ చేస్తున్నారు. మరి పురుషుల కండల ప్రదర్శన గురించి ఎవరూ అడ్డుచెప్పరు ఎందుకు? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. వారు తమ అందమైన బాడీతో అపోజిట్ జెండర్‌ను అట్రాక్ట్ చేయాలనుకుంటే ఇది కూడా అంతేనని మరొకరు వ్యాఖ్యానించారు.



Next Story