క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచాలి: అదనపు కలెక్టర్ రాజర్షి షా

by Satheesh |
క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచాలి: అదనపు కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచడం ద్వారా క్షయను ప్రాథమిక దశలోనే గుర్తించి త్వరితగతిన సత్వర చికిత్స మొదలు పెట్టాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం జిల్లా టీబీ ఫోరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రతి పీ‌హెచ్‌సీ నిర్దేశించిన టీబీ కేసుల టార్గెట్‌ను పూర్తిచేయాలన్నారు. ఆశా కార్యకర్తల ద్వారా పీ‌హెచ్‌సీ‌కి తీసుకెళ్ళి పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ చక్రపాణి, డీటీసీఓ డాక్టర్ రాజేశ్వరీ, ఇంచార్జీ డీఎం అండ్ హెచ్‌వో శశాంక్, కార్పోరేట్ సెక్టార్ డాక్టర్ శ్రీధర్, ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఫ్యాకల్టీ డాక్టర్ అరవింద్, కుష్టు, హెచ్‌ఐవీ ఆఫీసర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఎన్టీఈపీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed