- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయవాదుల కోసం ముందుండి పోరాడతా: సత్యనారాయణ
దిశ, ఖమ్మం లీగల్: ఖమ్మం జిల్లా అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఏఐఎల్‌యూ) ఆధ్వర్యంలో శనివారం టీటీడీసీ భవన్‌లో జూనియర్ న్యాయవాదులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. వీటిని అడిషనల్ జిల్లా జడ్జి, ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీమతి డేనీ రూత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శిక్షణ తరగతులను ప్రారంభించారు.. ఆ తర్వాత జూనియర్ న్యాయవాదుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎల్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. జూనియర్ న్యాయవాదులు విధిగా కోర్టుకు హాజరు కావాలని, సీనియర్ న్యాయవాదుల వారి పట్ల క్రమశిక్షణతో మెలగాలని, అంకితభావంతో పనిచేసి వారి వద్ద నుండి మెళకువలు నేర్చుకోవాలని తెలిపారు.
అంతేకాకుండా ఏఐఎల్‌యూ నిర్వహించబోయే శిక్షణ తరగతులను ప్రతి జూనియర్ లాయర్ క్రమం తప్పకుండా హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయవాదులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను ముందుండి పోరాడుతామని జూనియర్ న్యాయవాదులకు భరోసా కల్పించారు. అనంతరం సివిల్ చట్టాలపై సీనియర్ సివిల్ న్యాయవాది కే. నరసింహారావు న్యాయవాదులకు శిక్షణా తరగతులు బోధించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ గుప్తా, ఐలు జిల్లా కార్యదర్శి సిహెచ్. వెంకట్ , మందడపు శ్రీనివాసరావు, ఏడునూతల శ్రీనివాసరావు,రాంబ్రహ్మం , జి.దిలీప్ , మీసాల వెంకటేశ్వర్లు, అంజని,రమాదేవి, శివ కృష్ణ, తన్నీరు పాపయ్య, వి.లక్ష్మీ నారాయణ, ఐలు పట్టణ కమిటీ ప్రెసిడెంట్ నల్లమల నవీన్ చైతన్య, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.