ఆ 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారా.. ఎవరైనా అమ్మారా..?: బక్క జడ్సన్

by Satheesh |
ఆ 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారా.. ఎవరైనా అమ్మారా..?: బక్క జడ్సన్
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్: 1200 మంది అమరుల త్యాగాలను గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఆమె నమ్మకాన్ని వమ్ము చేసి, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలను రేపు అసెంబ్లీ గేట్ దగ్గర అడ్డుకుంటామని బక్క జడ్సన్ తెలిపారు. నేడు గాంధీభవన్ వద్ద కేసీఆర్ అప్రజాస్వామ్యంగా టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలని నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. సీఎల్పీ వీరిని భర్తరఫ్ చేయడంలో ఎందుకు విఫలం అయిందో అర్ధం కాలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ భుజాలపై ఎత్తుకొని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. వారి కష్టాన్ని కాసులకు అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారా..? ఎవరైనా అమ్మారా..? లేదంటే కేసీఆర్ వాళ్లను బెదిరించి లాక్కున్నాడా..? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అది తెలియాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు సుధాకర్, హరిశ్వర్ధన్, విక్రం తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story