- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్తీ ‘వా వాతియార్’ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. టీజర్ విడుదల
దిశ, సినిమా: కోలీవుడ్ హీరో కార్తీ(Karthi), నలన్ కుమారస్వామి కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘వా వాతియార్’(Vaa Vaathiyaar). స్టూడియో గ్రీన్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతిశెట్టి(Kriti Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, వా వాతియార్ మూవీ మేకర్స్ ‘వా వాతియార్’ టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. అయితే ఇందులో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా నడుస్తూ మ్యూజిక్ బిట్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అలాగే యాక్షన్, కామెడీ జానర్లో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం.
‘వా వాతియార్’ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం వెల్లడించక పోవడంతో కార్తీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, యంగ్ బ్యూటీ కృతి శెట్టి తెలుగులో ‘ఉప్పెన’(Uppena) తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అమ్మడుకి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. దీంతో కృతికి తెలుగులో ఆవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కు చెక్కేసింది. ప్రజెంట్ అక్కడే పలు చిత్రాల్లో నటిస్తోంది.