Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (01-12-2024)

by Anjali |   ( Updated:2024-11-30 21:45:55.0  )
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (01-12-2024)
X

మేష రాశి: నేడు మేష రాశి వారి ఖాళీగా ఉండకుండా.. పనిచేసుకుంటే.. మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. ఆర్థికంగా బాగుపడతారు. ఇవాళ మంచి మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇవాళ మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

వృషభ రాశి: ఇవాళ మీ రిలేషన్స్ మీకు హెల్ప్ చేస్తారు. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. కొత్తగా ఆలోచిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మీరు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు నేడు ఫలమిస్తాయి.

మిథున రాశి: ఏదైనా పనిచేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. లేకపోతే దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటి పనులు కంప్లీట్ చేయడంలో మీ పిల్లలకు మీకు హెల్ప్ చేస్తారు. ఎదువారితో నేడు సూటిగా సమాధానం చెబుతూ మాట్లాడుతారు. నేడు చాలా ఎనర్జీగా పని చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. భాగస్వామి మీ మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు.

కర్కాటక రాశి: భూములు కొనాలనుకున్నవారికి నేడు మంచి రోజు. బాగా కలిసి వస్తుంది.ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. ఇతరులను నమ్మి ఏ రహస్యం కూడా అస్సలు చెప్పకూడదు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. మీ భాగస్వామి మీతో మునుపెన్నడు లేని విధంగా మీతో ప్రేమగా ఉంటారు.

సింహ రాశి: నేడు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికపరంగా దూసుకుపోతారు. గతంలో చేసిన తప్పులను నేడు తెలుసుకుని బాధపడుతారు. ఫ్రెండ్స్ నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో ఒత్తికి గురవుతారు. ఎక్కువగా నడవడానికి ఇష్టపడుతారు.

కన్యా రాశి: ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి ప్రేమలో నిరాశకు గురవుతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌ తో గడుపుతారు.

తులా రాశి: మంచి ఫలితాలు పొందడం కోసం మీరు ఏకాగ్రతతో పని చేయండి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు. కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు.

వృశ్చిక రాశి: మీ చిరకాల అప్పులను తీర్చేస్తారు. మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. చెడు ఆలోచనలు మానుకోవడం మంచిది. వైవాహిక జీవితం కంట్రోల్ తప్పుతుంది.

ధనుస్సు రాశి: మీ ఆలోచనలు మీ అదుపులో ఉంచుకోవడం బెటర్. ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. నేడు డబ్బు పరంగా బాగానే ఉంటారు. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రశాంతంగా గడుపుతారు. అన్నాదమ్మలు, అక్కాచెల్లెల్లతో కలిసి సినిమాకు వెళ్తారు. భాగస్వామితో కలిసిమెలిసి ఉంటారు.

మకర రాశి: భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. మీ భాగస్వామితో అన్ని విషయాలు పంచుకుంటారు. చిన్న చిన్న విషాలకే ఎక్కువగా ఎగ్జైట్ అవుతుంటారు. డబ్బు సంపాదించాలని బాగా ఉంటుంది. కానీ ఇంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతుంటారు. నేడు ఎక్కువగా బయట గడుపుతారు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కుంభ రాశి: నేడు ఈ రాశివారు కొత్తగా ఆలోచిస్తారు. మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. దీంతో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు నెత్తిమీద వేసుకుంటారు. ఎక్కువగా చాక్లెట్స్ తింటారు. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తారు.

మీన రాశి: ఈ రాశి వారు భయాన్ని పోగోట్టుకోవడం మంచిది. నేడు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. డబ్బు సంపాదిస్తారు.కానీ ఇట్టే మాయమైపోతుంది. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు నేడు ఏ పని చేసిన విజయం సాధిస్తారు.

Advertisement

Next Story