లంగ్ క్యాన్సర్‌ను గుర్తిస్తున్న నెమటోడ్స్

by samatah |
లంగ్ క్యాన్సర్‌ను గుర్తిస్తున్న నెమటోడ్స్
X

దిశ, ఫీచర్స్ : లాలాజలం, మూత్ర నమూనాల ఆధారంగా శునకాలు క్యాన్సర్‌ వ్యాధిని గుర్తిస్తాయని తెలిసిందే. చీమలు కూడా ఈ విషయంలో తమ ఘ్రాణశక్తిని ఉపయోగిస్తాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించగా.. రౌండ్‌వార్మ్ C. ఎలిగాన్స్‌కు సైతం ఈ సామర్థ్యం ఉన్నట్లు తాజాగా బయటపడింది. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించగలవని దక్షిణ కొరియాలోని మోంగ్జీ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.



లంగ్ క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కంటే భిన్నమైన వాసనతో కూడిన అణువులను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ వ్యాధిని గుర్తించేందుకు రౌండ్‌వార్మ్‌ను ఉపయోగించవచ్చనే ఆలోచనతో కొరియాలోని మోంగ్జీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ఇందుకోసం వార్మ్-ఆన్-ఎ-చిప్(పాలీడిమెథైల్‌సిలోక్సేన్ ఎలాస్టోమర్ చిప్‌)ను అభివృద్ధి చేశారు. ఈ చిప్‌లోని అగర్ ప్లేట్‌పై ఒక చివరన లంగ్ క్యాన్సర్ కణాలను, మరొక ఎండ్‌లో సాధారణ ఊపిరితిత్తుల కణాల డ్రాప్‌ను ప్లేస్ చేశారు. ఈ రెండింటి మధ్యన ఉన్న పురుగులు ఎటువైపు వెళ్తున్నాయో గమనించారు. ఒక గంట సమయం తర్వాత సాధారణ లంగ్ సెల్స్‌తో పోలిస్తే క్యాన్సర్ కణాలున్న డ్రాప్ వైపే ఎక్కువ నెమడోట్స్ పాకినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇక ఈ 'వార్మ్-ఆన్-ఎ-చిప్' పరికరం 70% సక్సెస్ రేటును కలిగి ఉండగా.. కచ్చితత్వంతో కూడిన ఫలితాల కోసం మరిన్ని ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

పూల సువాసనను ఉత్పత్తి చేసే ఒక రకమైన ఆల్కహాల్ సమ్మేళనానికి నెమటోడ్స్ ఆకర్షితమవుతున్నాయని మ అధ్యయనం కనుగొంది. కాగా సి. ఎలిగాన్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కణజాలాలకు లేదా 2-ఇథైల్-1-హెక్సానాల్‌కు ఎందుకు ఆకర్షితులవుతున్నాయో కచ్చితమైన కారణాన్ని చెప్పలేం. కానీ ఆయా వాసనలు వాటికి ఇష్టమైన ఆహారాల నుంచి వచ్చే సువాసనలను పోలి ఉంటాయని ఊహిస్తున్నాం.

- పరిశోధకుల బృందం

Advertisement

Next Story