- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతను ఇచ్చిన ఆ రూ.500 లతో నా లైఫే మారిపోయింది.. రామ్ చరణ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్(Rakul Preet Singh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun), నాగార్జున(Nagarjuna) వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లింది. ఇక టాలీవుడ్‌లో స్టార్‌గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. కానీ, అక్కడ ఈ భామకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగన్(Ajay Devgan)తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ దీపావళి పండుగ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. "నిజానికి దీపావళి(Diwali) పండుగను అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అలాగే ఆ రోజు అందరూ టపాసులు కాలుస్తారు. అలా ఓ దీపావళి రోజున మా నాన్న రూ.500 నోటు ఇచ్చాడు. అప్పుడు నేను ఎందుకని అడిగితే.. ఈ మనీ తోనే కదా నువ్వు టపాసులు కొనుక్కోని కాలుస్తావు. దానివల్ల ఎంత కాలుష్యం, అదే ఈ డబ్బుతో ఎవరన్నా పేదవారికి, అవసరం ఉన్న వారికి చాక్‌లెట్స్ లేదా ఇంకేమన్నా కొనివచ్చు అని అన్నారు. అప్పుడు మా నాన్న చెప్పింది నిజమే కదా అనిపించింది. ఈ సంఘటన జరిగినప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ నేను టపాసులు కాల్చలేదు" అంటూ చెప్పుకొచ్చింది రకుల్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.