- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగతనానికి వచ్చిన దొంగ.. అలా జరగడంతో దొరికిపోయాడు..
దిశ, వెబ్‌డెస్క్: ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్న నానుడి మనమంతా వినే ఉంటాం. అయితే ఆంధ్రాలో జరిగిన ఓ ఘటన ఈ నానుడికి అద్దం పడుతోంది. దొంగతనం చేద్దామని వచ్చిన దొంగ స్థానికులకు రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయాడు. దొంగతనం చేద్దామని గోడకి చేసిన రంధ్రంలోనే ఇరుక్కుపోయి దొంగ దొరికిపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం కంచిలి మండలంలోని జడిముండి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనానికి పాల్పడింది ఆర్ పాపారావ్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గ్రామంలోని ఆలయంలో దొంగతనం చేసేందుకు దొంగ స్కెచ్ వేశాడని, అనుకున్నట్లుగానే ఆలయ గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లాడు.
అంతా ప్రణాళిక ప్రకారం ఆలయంలోని దేవత విగ్రహానికి ఉన్న ఆభరణాలను దొంగలించాడు. అయితే తిరిగి వచ్చే సమయంలో గోడకు చేసిన రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దాంతో వెంటనే అతడు తనను విడిపించమంటూ కేకలు వేశాడు. దాంతో చుట్టుపక్కల వారు అతడిని గమనించి పోలీసులను సమాచారం అందించారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గోడ నుంచి బయటకు తీసి అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ చిరంజీవి తెలిపారు.