pumpkin seeds: ఆడవాళ్లలో ఈ ప్రాబ్లమ్స్.. గుమ్మడి గింజలతో పరిష్కారం..?

by Anjali |
pumpkin seeds: ఆడవాళ్లలో ఈ ప్రాబ్లమ్స్.. గుమ్మడి గింజలతో పరిష్కారం..?
X

దిశ, వెబ్‌డెస్క్: గుమ్మడి గింజలు (Pumpkin seeds) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ గుమ్మడి గింజలు పుష్కలంగా ఖనిజాలను అందించడమే కాకుండా ఎముకల (బోన్స్ strong)ను, శరారాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు మేలు చేస్తాయి. దట్టమైన పోషకాలతో నిండిన ఈ గింజలు తింటే తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

గుమ్మడి గింజలలోని పోషకాలు, వాటి ఉపయోగాలు చూసినట్లైతే.. గుమ్మడి గింజల్లో ఐరన్ (Iron)అధికంగా ఉంటుంది. అందువల్ల, రక్తహీనతను నివారించడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ గింజల్లో ఉండే జింక్ ఇమ్యూనిటి పవర్ (Immunity power) ను పెంచడంలో మేలు చేస్తుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

గుమ్మడి గింజల్లోని ట్రిప్టోఫాన్(Tryptophan) అనే అమైనో ఆమ్లం నిద్రను ప్రోత్సహిస్తుంది. అలాగే గుమ్మడి గింజల్లోని ఇనుము, మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ కొవ్వు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. గుమ్మడి గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. వీటిలోని ఖనిజాలు సులభంగా ఎముక పగుళ్లు అండ్ బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులను నియంత్రించేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతుంటారు.

గుమ్మడి గింజలు అనేక సమస్యల్ని దూరం చేస్తాయి. చాలా మంది వీటిని ఇష్టపడుతారు. అయితే గుమ్మడి గింజలే కాదు.. గుమ్మడి ఆకులతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ ను దూరం చేస్తాయట. ఎన్నో సమస్యల్ని తరిమికొట్టే శక్తి గుమ్మడి గింజల్లో ఉంటుంది. ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్(Flavonoids), బీటా కెరోటిన్ (Beta carotene) వంటి యాంటీ ఆక్సిడెంట్లు దట్టంగా ఉంటాయి.

అంతేకాకుండా గుమ్మడి ఆకుల్లో కాల్షియం, విటమిన్ బి6, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు మానసిక, శారీరక అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతుంటారు. కాగా ఈ గుమ్మడి గింజల తీసుకోవడం వల్ల మహిళల హెల్త్ కు చాలా మంచిదట. మహిళలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

మహిళలు గుమ్మడి ఆకులు తినడం వల్ల ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (Premenstrual syndrome)సమస్య నుంచి బయటపడుతారు. నిరాశ, తలనొప్పి, చిరాకు, మానసిక ఆందోళన వంటి ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. కాగా డైట్ లో చేర్చుకుంటే గుమ్మడి ఆకుల్లోని మాంగనీస్ పీఎంఎస్ ప్రాబ్లమ్ కు చెక్ పెడుతుంది. అంతేకాకుండా మహిళల్లోని మలబద్దకాన్ని నియంత్రిస్తుంది.

ఎముకల్ని స్ట్రాంగ్ గా చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడం, రక్తహీనత సమస్య(Anemia problem)తో బాధపడుతోన్న వారు గుమ్మడి ఆకుల్ని డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి పీరియడ్స్ సమయంలో మహిళలు ఫేస్ చేసే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.



Next Story

Most Viewed