- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం ప్రియులు వెరీ లక్కీ.. స్పెషల్‌గా బెల్టుషాపు రన్ చేస్తున్నఓ సంఘం
దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలోని ఓ సంఘభవనంలో బెల్ట్ షాప్ నిర్వహించడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల దగ్గరలో ఉన్న ఓ సంఘం భవనంలో యథేచ్ఛగా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ.. ప్రజల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
గతేడాది అదే గ్రామానికి చెందిన ఓ బెల్ట్ షాప్ దగ్గర జరిగిన హత్య.. ఆ మృతుడి కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అప్పుడు గ్రామంలోని బెల్టుషాపులు మూసేయాలి అంటూ గ్రామస్తులు, మహిళా సంఘాల నాయకులు భారీ ఎత్తున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. స్పందించిన అప్పటి మెట్పల్లి డీఎస్పీ గౌస్ బాబా, సీఐఎల్ శ్రీను ధర్నా వద్దకు చేరుకొని మీ గ్రామంలోనే కాదు మండలంలో ఎక్కడ కూడా బెల్టుషాపులు జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చి సర్దు చెప్పారు. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్నా.. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. గ్రామం మళ్లీ బెల్ట్ షాపులు తెరవడంతో ఎవరికీ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
తూతూ మంత్రంగా దాడులు..
గ్రామంలో వెలసిన బెల్ట్ షాపులుపై ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపి కేవలం రూ. 2,800 విలువైన మద్యం స్వాధీనం చేసుకొని వదిలేశారని.. మళ్లీ యథావిధిగా బెల్ట్ షాప్ కొనసాగించడంపై అధికారులు మామూళ్లకు అలవాటు పడ్డారా..? అంటూ ఆ గ్రామంలో చర్చనీయంగా మారింది. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి గ్రామంలో బెల్ట్ షాప్ లేకుండా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.