- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడ్జెట్‌లో అమరావతికి కేటాయింపులు లేకపోవడం దుర్మార్గం
by Nagaya |
X
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌పై టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు పెదవి విరిచారు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదో మాయల మరాఠీ బడ్జెట్ అంటూ మండిపడ్డారు. మరోవైపు అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అందుకు తగ్గ రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. న్యాయస్థానం తీర్పును సైతం ఈ ప్రభుత్వం విస్మరించి కోర్టు ధిక్కారణకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్‌లో అమరావతి పేరు ప్రస్తావన కూడా లేకపోవడం దుర్మార్గమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలెవరికీ రుణాలివ్వలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Advertisement
Next Story