ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by GSrikanth |
ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సినీ రంగం నష్టాలపాలైంది. థియేటర్లు కూడా కరోనా నిబంధనలతో 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించారు. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోవడంతో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో గతంలో ఉన్న బెనిఫిట్ షోపై నిర్ణయం తీసుకోవాలని సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరగా.. ఐదో షోకు అనుమతులు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలైన రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు ఊరట కలగనుంది. ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట మధ్యలో ఐదో ఆట ప్రదర్శనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.





Advertisement

Next Story

Most Viewed