- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ అలా చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తునారు: రవీందర్ రెడ్డి
దిశ, తాండూర్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నాడని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సూరం రవీందర్ రెడ్డి అన్నారు. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ మంగళవారం తాండూరు మండలం ఐబీలో కాంగ్రెస్ నాయకులు నోటికి నల్ల రిబ్బెన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్కకు రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడే సమయం స్పీకర్ ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్పీకర్ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేస్తూ, కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఎండీ ఈసా, నాయకులు యశోద, దామోదర్ రెడ్డి, మోమిన్ అలీ, పుట్ట శ్రీనివాస్, జూబైర్, హైమద్ అలీ, శ్రీనివాస్, మురళి, లక్ష్మణ్, బానేష్, కృష్ణ, కిషన్, షఫీ ఉద్దీన్, నగేష్, శంకర్, కె.శ్రీనివాస్, చంద్రయ్య, రాజేశం, పర్వత రావు, సురేష్, కళ్యాణ్, తిరుపతి, మల్లేష్ పాల్గొన్నారు.