కొడుకు కోసం వెళ్తే ఇక్కడ వాళ్ళు ఇల్లు గుల్ల చేశారు..

by Vinod kumar |
కొడుకు కోసం వెళ్తే ఇక్కడ వాళ్ళు ఇల్లు గుల్ల చేశారు..
X

దిశ, మొయినాబాద్: కొడుకును చూద్దామని ఊరెళితే దొంగలు ఇల్లు కొల్లగొట్టిన ఘటన మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామనికి చెందిన ఇందూరుపటి సామయ్య, సారలమ్మ బుధవారం శ్రీకాకుళం లో ఉన్న తన కొడుకును చూడటానికి ఊరు వెళ్లారు. అదే అదనుగా చూసుకున్న దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సారలమ్మ, సామయ్య ఇంటి పక్కన ఉన్న శంకరయ్య ఉదయం చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో సారలమ్మ వల తమ్ముడు జనార్ధన్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.


ఆయన వచ్చి చూడగా ఇంట్లో ఉన్న బీరువా తాళాలు పగలగొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఈ మేరకు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బీరువాలో దాచి ఉన్నటువంటి రెండు జతల చెవి కమ్మలు, ఒక తులం బంగారం, అర్ధ తులం ఉంగరం, అర్ధ తులం బంగారం చైన్, రూ.18,000 నగదు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. జనార్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నయీం తెలిపారు.



Advertisement

Next Story