- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాబిన్ హుడ్’ విడుదల తేదీ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
దిశ, సినిమా: హీరో నితిన్(Nithin), దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్ హుడ్’(Robin Hood). ఇందులో క్రేజీ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇది నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులు షూటింగ్ చేస్తే టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది. ఇప్పటికే రాబిన్ హుడ్ నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.
తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే గతంలోనే రాబిన్ హుడ్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించినప్పటికీ అదే రోజున రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ విడుదల కాబోతుండటంతో మేకర్స్ వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి వాయిదా పడటంతో రాబిన్ హుడ్ క్రిస్మస్ కానుకగా రాబోతున్నట్లు మరోసారి ఫైనల్ చేశారు.