Heart attack: డ్యాన్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా హార్ట్‌ ఎటాక్ రావడానికి కారణం.. నిపుణులు చెబుతున్నదిదే?

by Anjali |
Heart attack: డ్యాన్స్ చేస్తున్నప్పుడు సడెన్‌గా హార్ట్‌ ఎటాక్ రావడానికి కారణం.. నిపుణులు చెబుతున్నదిదే?
X

దిశ, వెబ్‌డెస్క్: డ్యాన్స్ (Dance) చేయడం వల్ల లాభాలు అనేకం. డ్యాన్స్ చేయడం వల్ల శారీరక(physical), మానసిక ఆరోగ్యానికి (Mental health) ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. డ్యాన్స్ చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు చూసినట్లైతే.. ఊపిరితిత్తుల పరిస్థితి (Lung condition)మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. గుండె ఆరోగ్యం(heart health), కండరాల బలం(Muscle strength), ఓర్పు, మోటార్ ఫిట్‌నెస్ (Motor fitness) పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

డ్యాన్స్ చేయడం వల్ల ఏరోబిక్ ఫిట్‌నెస్(Aerobic fitness) పెరుగుతుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరుగడం(Memory enhancement)తో పాటు బీపీ అదుపు(BP control)లో ఉంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది(Mood improves). సామాజిక సంభాషణకు అవకాశం లభిస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో డ్యాన్స్ పాఠశాలలు సామాజిక, సాంస్కృతిక మెరుగుదలలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ అనేది ఆరోగ్యవంతమైన శారీరక శ్రమ(physical activity). డ్యాన్స్ చేయడం వల్ల డే మొత్తం ఎనర్జీగా ఉంటారు.

అయితే ఇటీవల చాలా మంది డ్యాన్స్ చేస్తూ గుండెపోటు(heart attack)తో చనిపోతున్న విషయం తెలిసిందే. ఏదైనా ఫంక్షన్స్‌, పెళ్లిళ్లలో కళ్లముందే అక్కడికక్కడే కుప్పకూలిపోతుండటం చూస్తూనే ఉంటాం. హఠాత్తుగా గుండెపోటుతో వేదికపైనే పడిపోతున్నారు. మరీ దీనికి కారణం ఏంటో తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా అయితే గుండెపోటు కుటుంబంలో ఎవరికైనా ఆ సమస్య ఉంటే జన్యుపరంగా వస్తుంది. అలాగే బాడీలో వాటర్ శాతం(Water percentage) తక్కువగా ఉండటం వల్ల, జీవన శైలిలో ఆహారపు అలవాట్లు కారణంగా గుండెపోటు వస్తుంది. అధికంగా ఆయిల్ పడటం వల్ల.. కొవ్వు పదార్థాలు (fatty substances)ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు.

అయితే ఇప్పటికే మధుమేహం(diabetes)ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, రక్తపోటు సమస్య(Blood pressure problem)తో బాధపడుతున్నవాళ్లు పలు కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తే గుండెపోటుకు గురవుతున్నారని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. డ్యాన్స్ చేస్తే బాడీ చాలా రిలీఫ్‌గా ఉంటుంది.. కానీ రక్తపోటు కూడా పెరుగుతుంది. అలాగే ఈ క్రమంలో బాడీకి ఆక్సిజన్(Oxygen) కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. కాగా హార్ట్ సమస్యలు ఉన్నవాళ్లు హైబీపీ పెషేంట్లు డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందని పేర్కొంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.



Next Story

Most Viewed