రష్యా చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో RBI

by Harish |
రష్యా చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో RBI
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం దృష్ట్యా, వాణిజ్యం కోసం, చెల్లింపుల కోసం మరొక విధానాన్ని చూడాలని భారతీయ బ్యాంకులను RBI కోరింది. దీనికోసం ఆర్‌బిఐ ఎంపిక చేసిన బ్యాంకులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. రష్యాకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నుండి దానిని తొలగించి నట్లయితే ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సిద్ధం చేయాలని బ్యాంకులకు RBI సూచించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, అమెరికా దాని మిత్రదేశాలతో సహా పలు దేశాలు దాని పై ఆంక్షలు విధించాయి. రష్యా VTB బ్యాంకింగ్‌పై US ఆంక్షలు విధించింది. ప్రస్తుతం బ్యాంకుల మధ్య ఎలక్ట్రానిక్ నగదు బదిలీ కోసం ఉన్నటువంటి గ్లోబల్ మెకానిజం SWIFT ప్లాట్‌ఫారమ్ నుండి ప్రధాన రష్యన్ బ్యాంకులను తొలగించాలని నిర్ణయించారు.

ఆర్‌బిఐ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. యూరోపియన్ యూనియన్ రష్యాకు చెందిన బ్యాంక్ ఓట్‌క్రిటీ, నోవికోమ్‌బ్యాంక్, ప్రోమ్స్‌వ్యాజ్‌బ్యాంక్, బ్యాంక్ రోసియా, సోవ్‌కాంబ్యాంక్, VNESHECONOMBANK (VEB), VTB బ్యాంక్‌లపై కూడా ఆంక్షలను ప్రకటించింది. ఈ బ్యాంకులు మార్చి 12, 2022 నుంచి SWIFT ద్వారా ఎలాంటి లావాదేవీలు చేయలేవు.

https://economictimes.indiatimes.com/industry/banking/finance/banking/rbi-asks-banks-to-find-alternative-mechanism-for-russia-payments/articleshow/90004783.cms

Advertisement

Next Story