Akhanda 2 : పాన్ ఇండియాగా ‘అఖండ 2’.. చెప్పినట్టే పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్

by Prasanna |
Akhanda 2 : పాన్ ఇండియాగా ‘అఖండ 2’.. చెప్పినట్టే పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అది పక్కా హిట్ అవ్వాల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ మూడు సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో హ్యాట్రిక్ హిట్ కొట్టి రికార్డు క్రియోట్ చేసారు.

అయితే, అఖండ మూవీ తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు. దసరా రోజు చెప్పినట్టే అఖండ 2 మూవీని ఈ రోజు అనౌన్స్ చేసారు. బాలయ్య – బోయపాటి కాంబోలో నాలుగో మూవీగా అఖండ 2 మూవీ రాబోతుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తాజాగా, టైటిల్ ప్రకటిస్తూ ఈ మూవీ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ రోజు అఖండ 2 సినిమా పూజా కార్యక్రమం జరగబోతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అయితే, ఈసారి అఖండ 2ని పాన్ ఇండియాగా విడుదల చేయనున్నారు. బాలయ్య సినీ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే రానుంది. దీనిపై రియాక్ట్ అయిన నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story