Ram Charan:‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి షాకిచ్చిన మేకర్స్.. నిరాశలో మెగా ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2024-10-13 14:56:18.0  )
Ram Charan:‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి షాకిచ్చిన మేకర్స్.. నిరాశలో మెగా ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మెగా అభిమానులు గత మూడేళ్ల నుంచి ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’(game changer). అయితే ఈ చిత్రం రామ్ చరణ్(Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)కాంబోలో తెరకెక్కుతోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు (Dil Raj) నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంను శంకర్(Shankar) మూడేళ్ల నుంచి తెరకెక్కిన్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీంతో ఫ్యాన్స్ పదే పదే అడగటంతో గేమ్ చేంజర్ క్రిస్మస్ కానుకగా రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ మూవీ వాయిదా పడినట్లు తెలుపుతూ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. అలాగే రామ్ చరణ్ పోస్టర్‌ను విడుదల చేశారు. గేమ్ చేంజర్ (game changer)సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ‘X’ వేదికగా ప్రకటించింది. క్రిస్మస్(Christmas) కానుకగా వస్తుందనుకున్న మూవీ వాయిదా పడటంతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి కారణం ఏంటంటే.. డిసెంబర‌లో పుష్ప-2 (Pushpa-2)ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసక్తికర విషయం ఏంటంటే.. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కూడా విడుదల కాబోతుంది. ఈ లెక్కన మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ రాబోతుందనే చెప్పాలి.

Advertisement

Next Story