- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ నాయకుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఆ అక్రమ సంబంధమే కారణమా..!
దిశ, భూపాలపల్లి: మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడి కిడ్నాప్ కేసును భూపాలపల్లి పోలీసులు చేధింఛారు. ఈనెల 16వ తేదీన మహదేవ్ పూర్ మండల్ సూరారం గ్రామానికి చెందిన సూరారం మహేష్ రెడ్డిని పెళ్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాధితుని బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహాదేవపూర్ సర్కిల్ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించినట్లు ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. చెల్పూర్ గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తికి.. పలిమెల గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది. అయితే అదే మహిళతో సూరారం గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి కూడా అక్రమసంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో.. చిరంజీవి, అతని మిత్రులతో కలిసి పలుమార్లు అతనిని బెదిరించాడు. ఈ క్రమంలో పని నిమిత్తం కారులో వెళ్తున్న మహేష్ రెడ్డిపై.. చిరంజీవి, అతని స్నేహితులు కలిసి దాడి చేసి డబ్బులు లాకున్నారు. దీనితో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నిందితులు అప్పటినుండి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నెల 16వ తేదీన మహేష్ రెడ్డిని కిడ్నాప్ చేసిన నిందితులు.. బాధితుడిని వివిధ ప్రదేశాల్లో తిప్పుతూ.. దాడి చేశారు. బాధితుడి మహేష్ వాళ్ల అన్నకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి అన్న సురేష్ వారికి 8లక్షలు ఇస్తానని ఒప్పుకుని.. కొంత డబ్బును ఆన్‌లైన్‌లో పంపాడు. ఈ క్రమంలో నిందితుల నుండి తప్పించుకోవడానికి మహేష్ నా దగ్గర ఉన్న డబ్బు డ్రా చేసి ఇస్తానని వారిని మహదేవ్ పూర్ తీసుకువెళ్లగా.. నమ్మదగిన సమాచారం అందడంతో పోలీసులు 21వ తేదీన మహదేవపూర్ శివారులోని అయ్యప్ప టెంపుల్ వెనకాల అడవిలో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దీనితో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.