- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Telangana News: మాదక ద్రవ్యాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం.. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్ది దిద్దేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాల రవాణాను అరికడుతోంది. అయితే, ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 7 వరకు ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన వాటి వివరాలను శనివారం విడుదల చేశారు.
దీని ప్రకారం గుడుంబా అమ్మకాలు, తయారీ కేంద్రాలపై దాడులు చేసి మొత్తం 1,756 కేసులు నమోదు చేసి, 8680 లీటర్ల గుడుంబాను, 73,882 కిలోల బెల్లం, 327 వాహనాలు సీజ్ చేశారు. అంతేగాకుండా 1,820 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు నివేదికలో వెల్లడించారు. వీటితోపాటు నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం.. 192 కేసులు నమోదయ్యాయి. 1,290 కిలోల గంజాయి, 65 ఎండిన గంజాయి మొక్కలు, 4.29 కిలోల హషీష్ ఆయిల్, 636 గ్రాముల వీడ్, 211 ఎండీఎంఏ మాత్రలు, 35 ఎల్ఎస్‌డీ బ్లాట్‌లు సీజ్ చేసి 304 మంది నేరస్థులను అరెస్ట్ చేశారు.