- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సవ్యసాచి సాహు ఆశయాలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి..
by Satheesh |

X
దిశ ప్రతినిధి, వరంగల్: సాహిత్య, ఉద్యమకారుడైన సవ్యసాచి సాహు ఆశయాల సాధనకుప్రతిఒక్కరూ కృషిచేయాలని భీమదేవరపల్లి మండల ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు పిలుపునిచ్చారు. మాణిక్యపూర్ బస్టాండ్ ఆవరణలో బుధవారం సాహు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు బండి రమేశ్ ఆధ్వర్యంలో సాహు 29వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహును స్మరించుకుంటూ ఆయన ఆశయాలను సాధించేందుకు నేటితరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏకకాలంలో రచయితగా, ఉద్యమకారుడిగా విశేష గుర్తింపు పొందిన ఈ సవ్యసాచి మాణిక్యాపూర్ ముద్దుబిడ్డ అంటూ కొనియాడారు. వర్ధంతి కార్యక్రమంలో గాంధీనగర్, మాణిక్యాపూర్ సర్పంచులు తాళ్లపెళ్లి తులశమ్మ రాజయ్య, వేల్పుల రవీందర్, ఎంపీటీసీ నాగిళ్ల గోపి శర్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
Next Story