ఆ వీడియో మాధవ్‌దే అనిపిస్తోంది: Raghu Rama Krishna Raju

by Naresh |   ( Updated:2022-08-04 08:04:24.0  )
That video seems to be Gorantla madhav, says Raghu Rama Krishna Raju
X

దిశ, వెబ్‌డెస్క్: That video seems to be Gorantla madhav, says Raghu Rama Krishna Raju| వైసీపీ నేత, ఎంపీ, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆ న్యూడ్ వీడియో తనది కాదని టీడీపీ నేతలే కావాలని వీడియోను మార్ఫింగ్ చేశారని మాధవ్ క్లారిటీ ఇచ్చారు. అయితే దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృషరాజు స్పందించారు. ఆ వీడియోలో ఎంపీ మాధవ్ ఉన్నట్టుగానే తనకు అనిపిస్తుందన్నారు. మాధవ్ చెప్పిన విధంగానే వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలని కోరారు. అయితే ఏపీలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లు కాకుండా ఇతర రాష్ట్రాల ల్యాబ్‌లకు వీడియోను పంపించాలన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి రెండు మూడు రోజుల్లోనే నిజాన్ని నిగ్గుతేల్చాలన్నారు. ఆ న్యూడ్ వీడియో మధవ్‌ది కాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో మాధవ్ వీడియో నిజమని తెలితే మహిళలు ఒక్కరు కూడా వైసీపీకి ఓటు వేయరని విమర్శించారు.

ఇది కూడా చదవండి: YCP ఎంపీ రాసలీలలు.. మహిళతో న్యూడ్ వీడియో కాల్

Advertisement

Next Story