ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

by Satheesh |
ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
X

దిశ, కుత్బుల్లాపూర్: దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. మంగళవారం అసెంబ్లీ చివరి రోజున ఆయన మాట్లాడుతూ.. శామీర్ పేట మండలం దేవరయాంజాల్‌లోని రాములవారి ఆలయ భూములు దశాబ్ధాలుగా కబ్జాలకు గురవుతున్నాయనే ఆరోపణలున్నాయన్నారు. దర్యాప్తుకు వేసిన ఐఏఎస్‌ల కమిటీ నివేదిక ఎంత వరకు వచ్చిందని, ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయా, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని సీఎంను కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్ దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. దేవరయాంజాల్ భూముల విచారణకు నియమించిన కమిటీ నివేదిక పూర్తి కావచ్చిందని.. త్వరలోనే కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. ఆ వెంటనే ఒక్క గజం కూడా కబ్జాకు గురికాకుండా ప్రభుత్వమే దేవుని భూములను కాపాడుతుందని సమాధానమిచ్చారు.

Advertisement

Next Story