- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KCR బయోపిక్ తీయబోతున్న ఆర్‌జీవీ

X
దిశ, సినిమా: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. ఇటీవల కాలంలో వరుసగా బయోపిక్‌లు తీస్తున్న ఆర్‌జీవీ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి 'కేసీఆర్' బయోపిక్ కూడా తీయబోతున్నానంటూ ప్రకటించేశాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'డేంజరస్' చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనగా.. ఏపీ టికెట్ రేట్ల విషయంలో తనకు ఇబ్బంది లేదని అలాగే తన సినిమాను ఓటీటీ, థియేటర్ రెండింటిలోనూ విడుదల చేస్తామని స్పష్టం చేశాడు. అలాగే 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ బాగా నచ్చిందని, త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తానని వెల్లడించాడు. దీనికి సంబంధించి వివరాలు త్వరలోనే తెలియజేస్తానంటూ అభిమానుల్లో ఉత్కంఠ క్రియేట్ చేశాడు.
Next Story