- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ రెడ్డి పాలన.. 'ఆ విషయంలో బ్రిటిష్ పాలకుల కంటే దారుణం'
దిశ, ఏపీ బ్యూరో : పన్నులు విధించటం, ప్రజల నుంచి డబ్బులు గుంజటమే ధ్యేయంగా సీఎం జగన్ రెడ్డి పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రద్దయిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను 36 జీవో పేరుతో తెరపైకి తెచ్చి జగన్ ప్రభుత్వం ప్రజలను పీడించి ఖజానా నింపుకోవాలనుకోవటం దుర్మార్గమని మండిపడ్డారు. సంపద సృష్టించడం చేతకాని సీఎం ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవడానికి అర్హత, హక్కు లేని అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పేరుతో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో 36 జీవో పేరుతో ఆ ప్రాంతాల్లో ఉన్న విలువ కంటే ఒకటిన్నర రెట్లు కట్టమని చెప్పి అర్బన్ ల్యాండ్ రెవెన్యూ చీప్ కమిషనర్ పేరుతో నోటీసులిచ్చిందని తెలిపారు. కనిపించిన ప్రతిదానిపై పన్నులు విధిస్తూ బ్రిటిష్ పాలకుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. చెత్తపన్ను, డ్రైనేజీ పన్ను, ఇంటి పన్ను, ఆస్తి పన్నలపై ప్రజల నుంచి ఇప్పటికే ప్రతిఘటన ఎదరవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం36 జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.