- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ కామర్స్‌లో భారీ పెట్టుబడి పెట్టిన టాటా సన్స్
దిశ, వెబ్‌డెస్క్: టాటా సన్స్ తన ఈ-కామర్స్ కంపెనీ టాటా డిజిటల్‌లో రూ.5,882 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తం నిధుల ద్వారా 2021-22లో టాటా డిజిటల్‌లో మొత్తం పెట్టుబడి రూ.11,872 కోట్లకు చేరుకుంటుంది. ఈ కామర్స్ రంగంలో టాటాల అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే మార్కెట్లో అతిపెద్ద వాటాదారులుగా ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలకు ఈ ఇన్వెస్ట్ ద్వారా టాటా గ్రూప్ పోటీ ఇవ్వడానికి సిద్దమవుతుంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ఫైల్‌లలో టాటా డిజిటల్ బోర్డు మార్చి 30న 5.88 బిలియన్ల పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను రైట్స్ ప్రాతిపదికన రూ. 10 చొప్పున డిజిటల్ హోల్డింగ్ ఎంటిటీ అయిన టాటా సన్స్‌కు కేటాయించడాన్ని ఆమోదించింది. టాటా డిజిటల్, డిసెంబర్ 2021-22 వరకు తొమ్మిది నెలల్లో టాటా సన్స్ నుండి అనేక విడతలుగా రూ. 5,990 కోట్లను పొందిందని నివేదిక పేర్కొంది. భారత వినియోగదారులకు అనుగుణంగా, డిజిటల్ రంగంలో వేగవంతమైన వృద్ధి కోసం, అనేక బ్రాండ్‌ల విక్రయాలను ప్రజలకు అందించడానికి టాటా కంపెనీ కొత్తగా సూపర్ యాప్ టాటా న్యూను ప్రారంభించింది.