భారీగా రేషన్ బియ్యం పట్టివేత

by Vinod kumar |   ( Updated:2022-03-11 13:57:26.0  )
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ, పరిగి: వికారాబాద్ జిల్లాలో భారీగా పట్టుపడ్డ రేషన్ బియ్యం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో శుక్రవారం 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కుస్మ సముద్రం గ్రామాని చెందిన రమేష్ వ్యక్తి దగ్గర 50 క్వింటాళ్లు , రాములు దగ్గర 25 క్వింటాలు, ప్రవీణ్ దగ్గర 5 క్వింటాళ్ల రేషన్ రైస్ ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి వద్ద మొత్తం 80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ని పట్టుకొని కుల్కచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed