కొత్తగా 50 జ్యువెలరీ స్టోర్లను ప్రారంభించనున్న Tanishq!

by Harish |   ( Updated:2022-04-01 12:45:39.0  )
కొత్తగా 50 జ్యువెలరీ స్టోర్లను ప్రారంభించనున్న Tanishq!
X

కోయంబత్తూర్: దేశీయ అతిపెద్ద గ్రూప్ సంస్థ టాటాకు చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 45-50 కొత్త స్టోర్లను ప్రారంభించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. వినియోగదారులు జ్యువెలరీ బ్రాండ్ స్టోర్లకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కంపెనీ కొత్త వాటి కోసం భారీగా పెట్టుబడులకు సిద్ధం అవుతున్నట్లు తనిష్క్-టైటాన్ కంపెనీ రిటైల్ విభాగం హెడ్ విజేష్ రాజన్ తెలిపారు. ప్రస్తుతం తనిష్క్‌కు దేశవ్యాప్తంగా 220 నగరాల్లో మొత్తం 385 స్టోర్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 45-50 కొత్త స్టోర్లను ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి కంపెనీకి చెందిన 90 శాతం స్టోర్లు ఫ్రాంచైజీల ద్వారా నిర్వహించబడుతోందని, బంగారం, వజ్రాలు సహా మొత్తం 2,000 కంటే ఎక్కువ డిజైన్‌లను కస్టమర్లకు అందిస్తున్నట్టు విజేష్ రాజన్ వివరించారు. దేశంలో ఆభరణాల పరిశ్రమ ఇప్పుడిప్పుడే కొవిడ్-19 మహమ్మారి నుంచి నిలదొక్కుకుంటోందని, గడిచిన కొన్ని నెలల్లో మెరుగైన వృద్ధిని సాధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story