- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీర్యం, అండాలు లేకుండానే 'సింథటిక్ పిండాలు' సృష్టి
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే మొట్టమొదటి సింథటిక్ పిండాలను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఎలుకల మూలకణాలను ఉపయోగించి పేగులు, అభివృద్ధి చెందుతున్న మెదడు, కొట్టుకుంటున్న గుండె వంటి నిర్మాణాలతో సమర్థవంతంగా పిండాలను రూపొందించారు. వీర్యం, అండాలతో కూడిన ఫలదీకరణ ప్రక్రియ అవసరం లేకుండానే ఇందులో విజయం సాధించారు. మొత్తానికి ఎలుకల నుంచి సేకరించిన మూలకణాలు ఈ నిర్మాణాలను సొంతంగా సమీకరించగలవని కనుగొన్నారు.
సింథటిక్ పిండాలు అంటే ఏమిటి?
ఫలదీకరణం చెందని అండాలతో సృష్టించబడిన పిండాలనే సింథటిక్‌గా వర్గీకరిస్తారు. ఇలా పిండాలు సహజసిద్ధంగా అభివృద్ధి చెందే సమయంలో అవయవాలు, కణజాలాల సృష్టిలో సాయపడే ప్రక్రియలను శాస్త్రవేత్తలు బాగా అర్థం చేసుకోగలరు. అంతేకాదు ఇటువంటి సింథటిక్ పిండాలు జంతువులపై ప్రయోగాల భారాన్ని తగ్గించగలవని.. మానవ మార్పిడి కోసం కణాలు, కణజాలాల కొత్త వనరులకు మార్గం చూపుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
'పిండ మూలకణాలు అనేవి మొత్తం సింథటిక్ పిండాలను ఉత్పత్తి చేస్తాయని మేము చూపిస్తాం. అంటే ఇందులో సాధారణంగా పిండం చుట్టూ ఉండేటువంటి ప్లాసెంటా, యోక్ శాక్ ఉంటాయి. ఈ ప్రాసెస్‌తో పాటు ఎదురయ్యే చిక్కుల గురించి నిజంగా సంతోషిస్తున్నాం' అని ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ జాకబ్ హన్నా తెలిపారు. గతేడాది అదే బృందం ఒక యాంత్రిక గర్భాన్ని సృష్టించింది. ఇది ఎలుకకు సంబంధించి సహజ పిండాలను చాలా రోజులు గర్భాశయం వెలుపల పెరిగేందుకు అనుమతించింది. ఇప్పుడు ఎలుకల మూలకణాలను ఒక వారం పాటు పెంచడానికి ఈ కొత్త ప్రయోగంలో అదే పరికరాన్ని ఉపయోగించారు.