Telangana News: 'వరి కొనుగోలు చేయకుంటే నీకు ఉరే' వేషధారణతో నిరసన..

by Vinod kumar |   ( Updated:2022-04-11 11:50:29.0  )
Telangana News: వరి కొనుగోలు చేయకుంటే నీకు ఉరే వేషధారణతో నిరసన..
X

దిశ, తుంగతుర్తి: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పలు సందర్భాల్లో విచిత్ర వేషధారణతో నిరసనలు తెలిపే సురేష్.. ఈ సారి ఢిల్లీ వేదికగా నిర్వహించే నిరసన కార్యక్రమానికి చేరుకున్నాడు. ఈ మేరకు సోమవారం వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావుతో పాటు సురేష్ తదితరులు ఢిల్లీకి వెళ్లారు.


ఈ సందర్భంగా సురేష్.. నిరసన దీక్షలో శరీరమంతా గులాబీ రంగును పులుముకొని 'వరి కొనుగోలు చేయకుంటే నీకు ఉరే', తదితర నినాదాలను రాయించుకొని దీక్షా కార్యక్రమంలో ప్రదర్శనగా తిరిగారు. ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రముఖులంతా సురేష్ విచిత్ర తరహా నిరసన వేషధారణను చూసి అభినందించారు. అంతేకాకుండా ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు..? అంటూ వివరాలు సేకరించారు. సురేష్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కోడూరు ప్రాంతానికి చెందిన వారు.

Advertisement

Next Story

Most Viewed