- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ajay Devgn: రివాల్వర్ చోరీ కేసులో జైలుకెళ్లిన బాలీవుడ్ హీరో.. సిగ్గుగా ఉందంటూ.....

దిశ, సినిమా: బీ టౌన్ హీరో అజయ్ దేవ్‌గణ్ యవ్వనంలో చేసిన పిచ్చిపనుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆనాలోచిత పనుల వల్ల రెండు సార్లు జైలుపాలయ్యానని, ఇప్పటికీ అవి గుర్తొస్తే చాలా సిగ్గుగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 'రన్ వే 34' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన.. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా ఉంటూ కాంట్రవర్సీలకు దూరంగా ఉండేవాడినని, అనుకోకుండా రెండు తెలివి తక్కువ పనులు చేయడం వల్ల జీవితంలో పెద్ద గుణపాఠాలు నేర్చుకున్నాని తెలిపాడు.
అయితే ఈ విషయాన్ని అయిష్టంగానే బయటపెడుతున్నానన్న అజయ్.. 'వాటి గురించి ఎక్కడ మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు ఇప్పుడు మంచి గుర్తింపు ఉంది. మనం యవ్వనంలో కొన్ని విచిత్రమైన, అనాగరికమైన పనులు చేస్తుంటాం. ఆ సమయంలో చట్టం, మీడియా వంటి వాటిని లెక్కచేయం. నేను కూడా అలా లైట్ తీసుకుని రెండుసార్లు జైలుకు వెళ్లాను. ఒకసారి మా నాన్న గన్ దొంగిలించడం అయితే మరొకటి చెప్పలేను. ఈ రెండు కారణాల వల్ల చిప్పకూడు తినాల్సి వచ్చింది'అని వివరించాడు.
- Tags
- ajay devgn