పోర్న్ సినిమాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.. సన్నీ

by Harish |
పోర్న్ సినిమాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.. సన్నీ
X

దిశ, సినిమా: హాలీవుడ్ మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ.. పోర్న్ చిత్ర పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ స్వతహాగా జీవించడం నేర్చుకున్నానని ఇదే తన జీవితంలో ఎదగడానికి సహాయపడిన గొప్ప విషయంగా పేర్కొంది. అలాగే మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఇతర వ్యక్తులు తీసుకోకూడదన్న సన్నీ.. చేసే ప్రతి పనిని నిజాయితీగా చేయగలగడమే అత్యుత్తమమైన లక్షణంగా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తన పిల్లల పెంపకంపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. 'ఇలాంటి వార్తలు రాసే వాళ్లంతా మన రోజువారీ జీవితంలో భాగం కానివాళ్లే. నా పిల్లల గురించి తీర్పులు చెప్పే ముందు కనీసం 5 నిమిషాల పాటు నా స్థానంలో ఉండి చూడండి' అంటూ చెప్పుకొచ్చిన సన్నీ.. ఒకరిద్దరూ పిల్లలను పెంచడం, చాలా మంది పిల్లలను పెంచడం అంటే ఎలా ఉంటుందో తెలిసిన తల్లిదండ్రులు కూడా ఇలా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed