చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

by Nagaya |   ( Updated:2022-07-25 05:11:28.0  )
చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో చుండ్రు సమస్యలు తలెత్తడం కామన్. ఫలితంగా మాడుపై చర్మం పొలుసులుగా ఊడిపోయి దురద, చికాకు కలిగిస్తుంది. అయితే ఎయిర్ పొల్యూషన్, కెమికల్ షాంపుల వాడకం, ఒత్తిడి, చలి వాతావరణం ఈ సమస్యను పెంచుతుండగా.. 'మాలాసిజియా గ్లోబోసా' అనే ఫంగస్‌ను ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇది చర్మం లేదా వెంట్రుకల్లో ఉండే నూనెను పీల్చుకుంటుంది. అదే సమయంలో ఓలెయిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్లే తలపై దురద పెట్టడం మొదలవుతుంది.

ఎలా పోతుంది :

* చుండ్రు సమస్యకు వేప నూనె శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది దురదను తగ్గించడంతో పాటు అలెర్జీ వంటి సమస్యలను అరికడుతుంది. డాండ్రఫ్‌కు కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. స్వైన్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుండే ఈ వేప నూనెతో ఉదయం, రాత్రి మాయిశ్చరైజ్ చేస్తే తలపైనున్న పుండ్లు తగ్గుతాయి. క్రమం తప్పకుండా వాడితే జుట్టును బలంగా తయారై మెరిసిపోతుంది.

* కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాక కేశాలు మృదువుగా మారతాయి.

* ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలకు మర్ధనా చేసినా ఫలితం ఉంటుంది. డాండ్రఫ్ తగ్గే వరకు ప్రతిరోజూ ఇదే అనుసరించాలి.

* చుండ్రు సమస్య తీవ్రంగా ఉంటే దాదాపు ఒక నెలరోజుల పాటు యాంటీ-డాండ్రఫ్ షాంపూ ఉపయోగించి చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి :

అతినిద్ర కలిగించే అనర్థాలు..

Advertisement

Next Story