- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sudheer Babu: వాళ్లు ఇష్టపడి ఇచ్చారు.. నేను ఎందుకు వదులు కోవాలి.. హీరో కామెంట్స్ వైరల్

దిశ, సినిమా: నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ (Sudheer) తన ట్యాగ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘హరోమ్ హర’ మూవీ టైటిల్ అనౌన్స్ చేసే టైంలో సుధీర్ బాబుకు నవ దళపతి అనే ట్యాగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సుధీర్ బాబును తన అభిమానులు, సన్నిహితులు నవ దళపతి ట్యాగ్‌తో పిలుస్తున్నారు. అయితే.. తాజాగా జరిగిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ప్రెస్ మీట్‌లో నవ దళపతి ట్యాగ్ గురించి ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా సుధీర్ బాబు స్పందిస్తూ.. ‘నా గత సినిమా ‘హరోమ్ హర’ డైరెక్టర్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత టైటిల్ కార్డ్స్‌లో నవ దళపతి ట్యాగ్‌ను యాడ్ చేస్తున్నట్లు చెప్పారు. మీకు నచ్చితే అదే కండిన్యూ చేయండి అని కూడా అన్నాడు. నన్ను ఇష్టపడే వారు ఇచ్చిన పేరును ఎందుకు వద్దు అనుకోవాలి అనే ఉద్దేశ్యంతో దాన్ని కంటిన్యూ చేశాను. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది’ అంటూ చెప్పుకొస్తూ.. నచ్చిన వాళ్లు ట్యాగ్‌తో పిలుస్తారు. లేదంటే సుధీర్ బాబు (Sudheer Babu) అనే పిలుస్తారు. ఎలా అయినా నాకు ఓకే అంటూ బదులు ఇచ్చాడు హీరో. ప్రజెంట్ ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.