'మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు'

by Disha News Web Desk |
మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
X

దిశ, మణుగూరు : పినపాక నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు నిర్వహించే నిర్వాహకులు పత్రికా విలేకరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శబరిష్ హెచ్చరించారు. శనివారం మండలంలోని ఏఎస్పీ కార్యాలయంలో స్థానిక టీవీ9 రిపోర్టర్ సతీష్, సాక్షి రిపోర్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపు నిర్వహకుల దౌర్జన్యంపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇసుక ర్యాంపు చేసే కొంత మంది నిర్వాహకులు మీడియాను అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో మీడియా సభ్యులు వినతిపత్రం అందజేశారని తెలిపారు. మీడియా అనేది సమాజానికి ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే మీడియాపై కొందరు ఇసుక నిర్వాహకులు అమాయక గిరిజనులతో కలిసి దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. వార్త సేకరణ కోసం వచ్చిన మీడియాపై దాడులు చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, ఉపేందర్, తూము సత్యం, ఐ.రవి, ఎల్లారావు, పాషా తదితర మీడియా సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed