- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాట్ టాపిక్‌గా స్టార్ హీరోయిన్, ప్రముఖ నిర్మాత ఇంటర్వ్యూ.. నటి ఎందుకు అలా చేసింది?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాత, స్టార్ హీరోయిన్ ఇంటర్వ్యూ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత తన రాబోయే చిత్రం విడుదలను ప్రమోట్ చేయడానికి ఓ స్టార్ హీరోయిన్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే సినిమా గురించి, అందులో నటించిన హీరో గురించి అడిగిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్న హీరోయిన్ ప్రతి సారీ నవ్వుతూ కనిపించింది. అయితే ఇంటర్వ్యూ చేసే నిర్మాత తాను నిర్మించిన సినిమాల వల్లే తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యిందని ఆయన పదే పదే చెప్పడంతో అమ్మడు హర్ట్ అయినట్టు తెలుస్తోంది.
దీంతో ఆమె మాట్లాడుతూ.. తనకున్న స్టార్‌డమ్ వల్లే పెద్ద స్టార్ సినిమా వచ్చిందని, ఆ చిత్రంతోనే తన కెరీర్ మొదలైందని ఆమె స్పష్టం చేసింది. నిర్మాత తన ఎదుగుదలలో నేను కూడా పెద్ద పాత్ర పోషించాను అని చెప్పడంతో హీరోయిన్ అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ నవ్వింది, కానీ లోపల చిరాకు పడింది. ఎందుకంటే ఈ నిర్మాత ఆమెకు అవకాశం ఇవ్వకముందే ఆమె ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు చేసింది. అలాగే ఆ హీరోయిన్‌కి మరొక దర్శకుడు దర్శకత్వంలో వచ్చిన సినమాలు పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఈ నిర్మాతను మెచ్చుకోవడం, పొగడటం హీరోయిన్‌కు ఇష్టం లేక నవ్వుతూ, మౌనంగా ఉండిపోయింది. ఏది ఏమైనప్పటికీ, ఆమె నవ్వు, ఇంటర్వ్యూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద టాపిక్‌గా మారింది.